రాజసూయ యాగం లో బాలకృష్ణ ఆంతర్యం ఏంటి?

చరిత్రలో రెండే రెండు సందర్భాల్లో  జరిగిన రాజసూయ యాగం ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్నారు. ఒక మాములు రాజు రాజర్షిగా అయ్యి దేశాన్ని ఒకే తాఠిపైకి తీసుకురావడానికి రాజసూయ యాగం చేసేవారు. ఒకప్పుడు ధర్మరాజు, ఆ తరువాత శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని చేసారు. ఇప్పుడు బాలకృష్ణ ఆ యాగాన్ని చేస్తున్నారు. మరి బాలయ్య ఎందుకు ఈ యాగాన్ని చేస్తున్నారు. ఆయన రాజు కాదు, రాజ్యాలు లేవు. ఇప్పుడసలు ఆ పాలనే లేదు. బాలకృష్ణ ఎందుకు ఈ యాగాన్ని చేపట్టినట్టు, ఇదే టాలీవుడ్ లో ప్రస్తుత చర్చ.

బాలకృష్ణ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రాజసూయ యాగాన్ని బాలయ్య మొదలు పెట్టారట. అత్యంత నియమ నిష్టలతో బాలయ్య ఈ యాగాన్ని చేపట్టారట. అయితే ఈ యాగం కృష్ణ డైరెక్షన్ లో రాబోతున్న గౌతమీ పుత్రశాతకర్ణి సినిమాలోని సన్నివేశం కోసం ఏర్పాటు చేసారు. అయితే కేవలం సినిమాకోసం మాత్రమే కాకుండా బాలకృష్ణ  నిజంగానే యాగాన్ని నిర్వహిస్తున్నారట. పురాణాల ప్రకారం ధర్మరాజు ఈ యాగాన్ని చేసినట్టుతెలుస్తుంది. ఆ తరువాత శాతకర్ణి రాజసూయ యాగం చేసాడు. ఇప్పుడు బాలకృష్ణ ఈ యాగాన్ని సినిమాలో సీన్లకోసం మాత్రమే చేయకుండా నిజంగానే యాగం చేయడం లో ఆంతర్యం ఏమిటని అర్ధకాని ప్రశ్న.

రాజకీయల్లో బాలకృష్ణ ఇప్పుడున్న దానికంటే ఎక్కువ స్థాయిని ఆశిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లోని ఒక కోటలో బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్న క్రిష్ ‘రాజసూయ యాగం’ కోసం భారీ సెట్ ని వేయించారు. ఈ యాగం విషయంలో బాలకృష్ణ తీసుకుంటున్న శ్రద్ధకు దర్శకుడు క్రిష్ కూడ షాక్ అవుతున్నట్లు టాక్. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలోని రాజసూయ యాగా చిత్రీకరణ నందమూరి తారకరామారావు జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ప్రారంభం కావడంతో బాలకృష్ణ ఈ ‘రాజసూయ యాగాన్ని చాల నిష్టగా జరిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.