మొదటి మూవీతో వరుణ్ తేజ్ హిట్

బాలనటుడిగా సినిమాల్లోకి ఎంటరై, తర్వాత హీరో అయి, సక్సెస్ ఫుల్ కెరీర్ ను ఏర్పరచుకుని గండర గండడు అనిపించుకుంటారు కొందరు. చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం అలాంటివారికి ఒక ఎడ్వాంటేజ్ అవుతుంది. ఆడియన్స్ లో ఎంతో కొంత ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి హీరోగా కెరీర్ కొంత ఈజీ అవుతుంది. పైగా సినిమా వారసత్వం ఉన్న వారికి మరింత సులభమవుతుంది.  అలాంటి యంగ్ గండర గండడు వరుణ్ తేజ్.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చాడు. 2000లో బాలనటుడిగా హ్యాండ్సప్ సినిమాలో నటించాడు. శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో వరుణ్ తన పేరుతో ఉన్న పాత్రే వేశాడు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు ఏ సినిమా కూడా  చేయలేదు. బాల్యం నుంచి యుక్తవయస్కుడిగా మారిన తర్వాత వరుణ్ 2014లో ముకుంద సినిమాతో హీరో అయ్యాడు.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన ముకుంద వరుణ్ కు బాగా కలిసొచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుణ్ కు ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో తీసిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ మెయిన్ కేరక్టర్ వేశాడు. ఈ సినిమా వరుణ్ ను నిజంగా మెగా ఫ్యామిలీ హీరోగా నిలబెట్టింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చేయడం వరుణ్ అదృష్టం. రెండో సినిమాతోనే ఐడెంటిటీ వచ్చింది.

కంచె సినిమాతో వరుణ్ వరసగా రెండో సక్సెస్ సాధించాడు. అన్నింటికంటే ముఖ్యమైన విశేషమేమంటే, ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో పాటు జాతీయ అవార్డు కూడా తెచ్చుకుంది. అంతటి మంచి సినిమాలో అవకాశం రావడం, నటించడం వరుణ్ కు చాలా హ్యాపీ ముమెంట్. ఆ తర్వాత పూరీ డైరెక్షన్ లో వచ్చిన లోఫర్లో వరుణ్ నటించాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిస్టర్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా సినిమాల్లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.