మెగా స్టార్ అమితాబ్ లేఖ

‘నీకు నచ్చిన దుస్తులే ధరించు, నీకు నచ్చిందే చేయి. నీ వ్యక్తిగత వ్యవహారాల్లోకి నీ తల్లిదండ్రులను కూడా కలగజేసుకోనివ్వొద్దు’. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా. డెబ్బైమూడేళ్ల యువకుడు అమితాబ్‌ బచ్చన్‌, చిత్రసీమలో ఓ ఆణిముత్యం. తన మనవరాళ్లైన నవ్య నవేరి, ఆరాధ్యలకు బహిరంగంగా లేఖ రాశారు.  వీరు తమ జీవితంలో ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా మసలు కోవాలో మార్గనిర్దేశం చేశారు.

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 73 ఏళ్ళ వయస్సులోను తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. అయితే తాజాగా తన మనవరాళ్ళకి బిగ్ బీ రాసిన లెటర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శ్వేతా బచ్చన్, నిఖిల్ కూతురు నవ్య నవేలి, ఐష్, అభిషేక్‌ల డాటర్ ఆరాధ్యకి అమితాబ్ తన లెటర్ ద్వారా మార్గ నిర్ధేశం చేసారు. జీవితంలో ఎవరి దగ్గర ఎలా ఉండాలో కట్టు బొట్టు విషయాలు కాని ఆచార వ్యవహారాలు ఎలా పాటించాలి అనే వాటిని తన లెటర్ లో వివరించారు అమితాబ్.

అమితాబ్ రాసిన లెటర్‌లో సమాజంకు సంబంధించిన అంశాలు, ఎవరెవరితో ఎలా మెలగాలి, స్నేహితులుగా ఎవరిని ఎంచుకోవాలి, పెళ్ళి ఎవరిని చేసుకోవాలని ఇలా చాలా విషయాలపై బిగ్ బీ తన మనవరాళ్ళకు లెటర్ ద్వారా సూచనలిచ్చారు. వారి జీవితాల్లో జరిగే అన్ని సంఘటనలకి కర్త, కర్మ, క్రియ వాళ్ళే కావాలని ఆయన తెలిపారు. ఇంక ఇంటి పేరు విషయంలోను ఓ ప్రస్థావన తెచ్చి నవ్యకి గొప్ప సలహా అందించారు. ఇక ఆరాధ్యకి ఇప్పుడు ఈ విషయాలు అర్ధం కావు కాబట్టి రానున్న రోజుల్లో అయిన ఇది చదివి అర్ధం చేసుకుంటుందని ఆశిస్తున్నట్టు బిగ్‌బి పేర్కొన్నారు.

తాను  చెప్పినవన్ని నవ్య, ఆరాధ్యలకు కాస్త కష్టంగా అనిపించొచ్చు, సమాజంలో అలా మసులుకోవడం కాస్త కష్టమైన పనే అయిన వాటిని పాటించి తన కన్నా గొప్ప పేరు సాధిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ అమితాబ్ పేర్కొన్నాడు. మీ లాంటి వారి వలన ఈ సమాజం మారుతుందనే తన నమ్మకం అన్నాడు. అమితాబ్‌గా కాకుండా ఓ తాతగా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ కావడం గ్రేట్ ఫీలింగ్ అని తాను విశ్వసిస్తున్నట్టు లెటర్ ద్వారా తెలిపారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.