మజ్ను రిలీజ్ డేట్

ఈ ఏడాది నేచురల్ స్టార్ నాని ఉన్నంత జోరుగా కానీ, చూపించినంత స్పీడ్ ను కానీ ఎవరూ రీచ్ కాలేకపోతున్నారనే మాట ఒప్పుకోవాల్సిందే. ఇప్పటికే రెండు సినిమాలు ఇచ్చేసి, రెండింటితోను హిట్ కొట్టేసి, ముచ్చటగా మూడో మూవీని మజ్ను అంటూ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే ఈ మూవీ ఆడియోతో హైప్ పెంచిన చిత్ర యూనిట్‌ తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

గతేడాది భలే భలే మగాడివోయ్ తో మొదలుపెట్టి, కృష్ణగాడి వీర ప్రేమగాధతో కంటిన్యూ చేసి, జెంటిల్మన్ గా సక్సెస్ సాధించిన నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో ఈ తరం మజ్నును తెరపైకి తెస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి కాగా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ముందుగా షెడ్యూల్ చేసిన డేట్ ప్రకారం అయితే ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఆడియో ఫంక్షన్ లో కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.

తాజాగా   మజ్నును ఓ వారం వెనక్కి జరుపుతున్నట్లు  నిర్మాతలు ఇప్పుడు అనౌన్స్ మెంట్ చేసారు . రీజన్ అయితే ఏమీ చెప్పలేదు కానీ, ఇతర చిత్రాలతో క్లాష్ లేకుండా ఉండేందుకే ఇలా అనే మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ 22న నాని మజ్ను థియేటర్లలోకి రావడం మాత్రం ఖాయమైంది. ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రామిసింగ్ గానే కనిపిస్తుండగా, భలేభలే మగాడివోయ్ తర్వాత నానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందించడం ప్రత్యేక ఆకర్షణ కానుంది.

అప్పటి మజ్ను తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తే ఈ మజ్ను కూడా బాక్సాఫీస్ బద్దలు కొడతాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలుస్తూ ఆకట్టుకుంటున్నాయి. కొత్తమ్మాయిలు అను ఇమాన్యుయేల్, ప్రియా శ్రీలు మజ్ను భామలుగా కనిపించనున్నారు. సినిమా కథ కథనం మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతుండగా ఈ అందాల భామల గ్లామర్ కూడా సినిమాకు చాలా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావన.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.