బాహుబలి హవా

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని దిశ‌ద‌శా చాటిన చిత్రం బాహుబ‌లి. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లు ఫిలిం ఫెస్టివ‌ల్ లో సైతం ప్ర‌ద‌ర్శిత‌మై విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలందుకుంది. గతంలో జ‌రిగిన‌ 63వ జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో అవార్డును ద‌క్కించుకున్నసంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఢిల్లీలో మొదలయిన ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శితమవుతుంది.

ఢిల్లీలో శుక్రవారం నుంచి ఈ నెల 6 వరకు జరగనున్న అయిదు దేశాల ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజమౌళి, ప్రభాస్ ల బాహుబలి సినిమాను కూడా ప్రదర్శించనున్నారు.బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల  నుంచి ప్రతి రోజూ నాలుగు మూవీలని సిరిఫోర్ట్ మల్టీ ప్లెక్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఇందుకు  బాహుబలి కూడా ఎంపికయింది.

ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి ది బిగినింగ్ తో పాటు తమిళ మూవీ  వీరమ్ మూవీని కూడా ప్రదర్శిస్తారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించడం విశేషం.  అయిదు దేశాల మధ్య  చలన చిత్ర రంగ సంబంధాలను పెంపొందించేందుకు ప్రధాని మోదీ ఇలా ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం గమనార్హం.

బాహుబలి ది బిగినింగ్ ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకోగా బాహుబలి 2 కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ క్లైమాక్స్ సీన్ రామోజి ఫిలిం సిటీలో జరుగుతుంది. రీసెంట్ గా వరుస వర్షాలవల్ల కొంత బ్రేక్ పడింది. బాహుబలిది కంక్లీజన్ మూవీ అనుకున్న ప్రకారం 2017 లో రిలీజ్ చేయడానికి యుద్ద ప్రాతిపదికన వర్క్ జరుగుతుంది. బాహుబలి ది బిగినింగే ఇంత రికార్డులను సృష్టిస్తుంటే,బాహుబలి 2 ఏరేంజ్ లో వుంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.