పవన్ కళ్యాన్ సభకు సర్వం సిద్దం

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా తిరుపతిలో సభనిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా మరోసభను కాకినాడలో ఏర్పాటు చేసారు. ఈ కాకినాడలో జరిగే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉదయం పవన్ కళ్యాన్ హైదరాబాద్ నుండి కాకినాడ చేరుకోనున్నారు. సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో జరగనున్న కాకినాడ సభ జేఎన్టీయూ మైదానంలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య వుండబోతుంది. ఈ మీటింగ్ కి దాదాపు 75 వేల మంది వరకు హాజరుకావచ్చునన్నది ఓ అంచనా! శనివారం కూడా అక్కడే వుండి వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారని సమాచారం.

మరోవైపు సభ విజయవంతం కావాలని కోరుతూ కాకినాడ రూరల్ పరిధిలో జనసేన కార్యకర్తలు పూజలు చేశారు.  ఈ క్రమంలో 22 కిలోమీటర్ల మేరా జనసేన కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. నిన్న జరిగిన అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్యాకేజీ మాత్రమే ఇస్తామని స్పష్టం చేసారు. కేంద్ర వైఖరిని నిరశిస్తూ పవన్ కళ్యాన్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే అవకాశం వుందని సమాచారం. ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో పవన్ కళ్యాన్ చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారనే విషయం తన మీటింగ్ ల వలన అర్ధమవుతుంది.

పవన్ కళ్యాన్ కాని ఆమరణ నిరాహార దీక్ష చేయడం నిజమే అయితే సీమాంధ్రతో పాటు క్రేంద్రలో పరిణామాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయని అంటున్నారు. పవన్ కళ్యాన్ కాకినాడ సభ తర్వాత ఆమరణదీక్షకు దిగే ఛాన్స్ వుందని కధనాలు వెలువడుతున్న తరుణంలో ఈ సభ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన పార్టీని చాలా ప్లాన్డ్ గా ముందుకు తీసుకెళుతున్న పవన్ కళ్యాన్  ఈ సందర్భాన్ని బాగా వుపయోగించుకునే అవకాశం వుందని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం జనసేన పార్టీ చేపట్టిన స్పెషస్టేటస్ నినాదం ఆ పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడానికి దోహదమవుతుంది. కాకినాడ సభలో పవన్ మాట్లాడబోయే అంశాలు ఆంధ్రరాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.