జనతా గ్యారేజ్ భారీ కలెక్షన్స్

స్టార్ డమ్ ఉన్న హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు ఒక్కోసారి వసూళ్ల వర్షం కురిపిస్తాయి. వానొచ్చినా, వరదొచ్చినా ఆ సినిమా కలెక్షన్లు మాత్రం ఆగవు. అవికూడా వరదలాగే భారీగా వస్తాయి. రిలీజ్ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆ తర్వాత జెట్ వేగంతో రన్ అవుతుంటాయి. అలాంటి సినిమానే యంగ్ టైగర్ నటించిన జనతా గ్యారేజ్. ఆ పిక్చర్ ఇప్పటికే కొన్ని రికార్డులు క్రియేట్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 1న రిలీజ్ (భారత్ బంద్ కు ముందు రోజు) అయిన ఈ పిక్చర్ వరల్డ్ వైడ్ గా హై రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించింది. బిగినింగ్ లో జనతా గ్యారేజ్ కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ  వీకెండ్ హాలిడేస్ ఎక్కువగా ఉండటంతో కలెక్షన్స్ ఫుల్ గా ఉంటున్నాయి. మొదటి అయిదు రోజుల్లో 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

ఈ సినిమా జూనియర్ ఎన్ టీఆర్ నటించిన అన్ని మూవీస్ లోనూ నంబర్ వన్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇండియాలోను, ఓవరీస్ లో కూడా జనతా ప్రభంజనం వీస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటివరకు మహేష్ బాబుదే పై చేయి అని అంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఆ రేంజ్ కి వచ్చేశాడు. యంగ్ టైగర్ నటించిన నాన్నకు ప్రేమతో, అమెరికాలో 2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా జనతా గ్యారేజ్ 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.

ఇంకో విశేషమేమంటే, అమెరికాలో  ఎన్టీఆర్ మూడు సినిమాలు టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరసగా మిలియన్ డాలర్లను వసూలు చేయడం. ఇది హ్యాట్రిక్కే. ఈ రికార్డులతో జూనియర్ ఎన్ టీఆర్ కూడా ఓవర్సీస్ వసూళ్లలో మహేష్ బాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ జాబితాలో చేరిపోయాడు. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమంటున్నారు.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.