జనతా పార్టీ

జనతా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ కి, కొరటాలకు మంచి హిట్ ని ఇచ్చింది. సోషల్ కాన్సెప్ట్ ని, కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి కొరటాల తన మార్క్ సినిమాను అందించాడు. ఈ సినిమా హిట్ తో ఎన్టీఆర్ మంచి జోష్ లో వున్నాడు. ఈ మధ్య కాలంలో అందరితో కలుపుగోలుగా వుంటున్న ఎన్టీఆర్ తన ఆనందాన్ని అందరితో కలిసి పంచుకోవాలని అనుకుంటున్నాడు.

జనతా గ్యారేజ్ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కొరటాల మరోసారి ప్రేక్షకులను తన మ్యాజిక్ తో మాయ చేసాడు. తన సహజ పద్దతిలో మెసేజ్ తో పాటు వినోదాన్ని పంచే సినిమాను ఇచ్చాడు. వరుస హిట్లతో వున్న ఎన్టీఆర్ కూడా ఈ సినిమా హిట్ తో మరింత జోష్ లోకి వెళ్ళాడు. ట్రైలర్ రిలీజ్ నుండే జనతా గ్యారేజ్ పై భారీ అంచనాలను ఏర్పరిచింది. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది జనతా గ్యారేజ్.

జనతా గ్యారేజ్ హిట్ ని ఎన్టీఆర్ అందరితో పంచుకోవాలనుకుంటున్నాడు. బయ్యర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్‌కి స్పెషల్‌గా పార్టీ ఇవ్వాలనే ఆలోచనలో ఎన్టీఆర్ వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అందరితో ఎన్టీఆర్ మాట్లాడడం, అందర్నీ హైదరాబాద్ సిటీకి రావాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం ఈ పార్టీ వుండే ఛాన్స్ వుంది.

జనతా గ్యారేజ్ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఫస్ట్ డే 20 కోట్ల వరకు వసూలు రాబట్టిన ఈ మూవీ శుక్రవారం కూడా తెలుగు రాష్ర్టాల్లో అదే దూకుడు కొనసాగినట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఇక ఓవర్సీస్‌లో ఫస్ట్ డే బెనిఫిట్ షోలతో దాదాపు 5 కోట్లు రాబట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు. ముందుగా టిక్కెట్లు బుకింగ్ ఐపోవడంతో వీకెండ్ వసూళ్లతో కలిపి నాలుగురోజులకు 50 కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.