జనతా గ్యారేజ్ రివ్యూ

చాలాకాలంగా ఇండస్ట్రీలో అదేపనిగా మాట్టాడుకుంటున్న సినిమా జనతా గ్యారేజ్. వరుస హిట్లలో వున్న కొరటాల, ఎన్టీఆర్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవడంతో అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల ఫార్ములా సక్సెస్ ఫుల్ గా వుండటంతో ట్రైలర్ రిలీజ్ అయ్యాక తన ఫార్ములో మరోసారి హిట్ అయినట్టే అని టాక్ వచ్చింది. ఎన్టీఆర్, మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్లను ఒకేసారి తెరమీద చూపించిన కొరటాల జనతా గ్యారేజ్ ని బాగానే నడపగలిగాడా లేదా అనేది పబ్లిక్ టాక్ ను బట్టి అంచనా వేసే ప్రయత్నం చేద్దాం.

కొరటాల మిర్చి సినిమా నుండి తన కంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.సామాజిక అంశాలను కమర్షియల్ కథతో జోడించి సక్సెస్ అయ్యాడు. కొరటాల ఈ ఫార్ములాకు నిదర్శనం శ్రీమంతుడు.సోషల్ మెసేజ్ ని ఆశక్తికరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ లో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. శ్రీమంతుడు సినిమా సమాజంలో ఎంత మార్పును తీసుకువచ్చిందో అందరం ప్రత్యక్షంగా చూసాం. అలాంటి మరో సోషల్ కాజ్ నే మరోసారి కొరటాల జనతా గ్యారేజ్ తో మనముందుకు తీసుకువచ్చాడు.

మనుషులంతా భూమిపై అతిధులు మాత్రమే, ఇక్కడి ప్రకృతిపై మనకు ఎటువంటి హక్కు లేదు.ప్రకృతిని ఉన్నది ఉన్నట్టుగా వుంచడం మన బాధ్యత అనేది కొరటాల శివ జనతా గ్యారేజ్ తో ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాడు. నేటి సమాజం ఆలోచించదగ్గ విషయమే ఆయన ప్రస్తావించాడు. అయితే శ్రీమంతుడు సినిమాతో ఊర్లు దత్తత తీసుకోవాలనే అంశాన్ని చెప్పినంత ఆసక్తిగా ఈ సినిమా పాయింట్ ని చెప్పలేకపోయాడనే విమర్శ వస్తుంది.

కథలో బలమైన సమస్య లేకపోవటంతో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తేలిపోయింది. ఎండింగ్ సింపుల్ గా చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా కథని చాలా స్లో నేరేషన్ లో నడిపారు. గాడ్ ఫాధర్ లాంటి మోహన్ లాల్ పాత్రకు, వారసుడుగా ఎన్టీఆర్ కనిపించటం బాగుంది. ముఖ్యంగా క్వారీ ఫైట్, వెంటనే వచ్చేఎన్టీఆర్, మోహన్ లాల్ మీట్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకు వెళ్లాయి. ఆ తర్వాత జనతాగ్యారేజ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వటం..ఇంటర్వెల్, తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తిని లేపాయి. అయితే క్లైమాక్స్ కి వచ్చేవరకు సినిమా డౌన్ అవడంతో ప్రేక్షకులు కొంత డిజపాయింట్ అయ్యారని తెలుస్తుంది.

సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక భాధ్యత కూడా అయివుంటే మంచిది. అదే విషయాన్ని కొరటాల చాలా గట్టిగా నమ్మినట్టు తన సినిమాలతో చూపించాడు. నేటి తరానికి సామాజిక బాధ్యతను ఇంట్రెస్టింగ్ గా చెప్పాలన ప్రయత్నం విమర్శకులను సైతం ఆకర్షిస్తుంది. గతంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు సినిమాలలాగానే జనతా గ్యారేజ్ కూడా మంచి ప్రయత్నంతో వచ్చింది. ఈ చిత్రం కుటుబంతో పాటు హాయిగా చూడటానికి కావల్సిన అన్ని అంశాలు వున్నాయి. కొరటాల, ఎన్టీఆర్ లు ఈ సినిమాతో మరో హిట్ కొట్టారని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published.