చిరు ఐటెం సాంగ్

చిరు అంటే స్టెప్పులు, స్టెప్పులు అంటేనే చిరు అలా అభిమానులను తన స్టెప్పులతో మెస్మరైజ్ చేసిన మెగాస్టార్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. దాదాపు 8 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిరు తన 150వ చిత్రంలో డ్యాన్స్ చేస్తాడా అనే డౌట్ గతంలో అందరికి కలిగింది. దానికి సమాధానంగా ఆ మధ్య జరిగిన ఓ ఈవెంట్‌లో తన స్టెప్పులతో మెగా అభిమానుల ఆనందాన్ని ఈ 61 ఏళ్ళ స్టార్ హీరో ఉరకలెత్తించాడు.  అయితే స్పెషల్‌ సాంగ్‌లో చిరుతో పాటు స్టెప్పులెవరేస్తారా అనేది హాట్‌ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్‑లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఖైదీ నెం.150’. తొలుత ఈ మూవీ టైటిల్ పై ఎంతో కసరత్తు జరిగింది. కత్తిలాంటోడు అని కొన్ని రోజులు మూవీ యూనిట్ ప్రచారం కూడా చేసినా, చివర్లో ‘ఖైదీ నెం.150’కి ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార, అనుష్క అని ప్రచారం జరిగినా చివరికి ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం మరో వార్త హల్ చల్ చేస్తోంది.

‘ఖైదీ నెం.150’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం దర్శకుడు వి.వి.వినాయక్ దక్షిణాది హీరోయిన్ కేథరిన్ ట్రెసాను సంప్రదించగా ఆమె ఒకే చెప్పేసింది. చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశాన్నిఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది. మెగాస్టార్ మూవీ అనగానే దాదాపు మూడు నెలల కిందటే కేథరిన్ ఈ మూవీలో సాంగ్ కోసం సంతకం చేసిందట. తాజాగా ఈ విషయాన్ని మూవీ యూనిట్ వారు వెల్లడించారు. అయితే ఈ సాంగ్ ఇంకా షూట్ చేయలేదట.

తమిళ మూవీ ఒరిజినల్ ‘కత్తి’ లో స్పెషల్‌ సాంగ్‌ లేదని,  టాలీవుడ్ ఆడియన్స్ కోసం మూవీ యూనిట్ చిన్న చిన్న మార్పులు చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిరు, కేథరిన్ లపై సాంగ్స్ చిత్రీకరణ జరగనుందని తాజా సమాచారం. చిరుకు ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వి.వి.వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  బన్నీతో ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాలలో  జత కట్టిన  కేథరిన్ చిరుతో ఎలాంటి స్టెప్పులు వేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.