క్రేజ్ తగ్గని కాజల్, సమంత

సినీ ఫీల్డ్ లో ఒక్కొక్కరిపై ఒక్కో ముద్ర పడుతుంది. హీరోలకైనా, హీరోయిన్స్ కైనా హిట్లు, ఫ్లాప్ లూ తప్పవు.  హీరోయిన్స్ చేసిన సినిమాలు వరసగా సక్సెస్ అయితే,,,వాళ్లకు  అమాంతం స్టార్ డమ్ రావడమే కాదు… గోల్డెన్ లెగ్ అనే పేరొస్తుంది. టాలీవుడ్ లో ఎట్ ప్రెజెంట్ గోల్డెన్ లెగ్ స్టార్లు ఇద్దరున్నారు. సక్సెస్ లు, ఫ్లాప్ లతో పనిలేకుండా వాళ్లకు వరస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇంతకూ వాళ్లెవరు?

మూవీ ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ ఇచ్చిన వారి చుట్టూనే తిరుగుతోంది. సీజనల్ గా సక్సెస్ లు తెచ్చేవారు కొందరైతే…ఎంతకాలమైనా క్రేజ్ తగ్గకుండా హై రేంజ్ లో ఉండేవారు మరికొందరు. కాజల్, సమంత ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్. ఇద్దరూ వచ్చి చాలా ఏళ్లయినా వాళ్ల గ్లామ్ చెక్కు చెదరలేదు. పవన్ కళ్యాణ్ తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవంపై కాజల్ హై హోప్స్ పెట్టుకుంది.

కానీ కాజల్ సినిమాలు రెండూ ఊహించని పరాజయాన్ని పొందాయి. దాంతో కాజల్ పనైపోయిందని, ఇక ఇంటికి వెడుతుందని అనుకున్నారు. కాజూ కూడా డిసైడైపోయిందని అనుకున్నారు. కానీ…లక్ ఆమెను నడిపిస్తోంది. ఫీల్డ్ నుంచి తప్పుకోవాలనుకున్నా కుదరలేదు. అనుకోకుండా మెగా ఆఫర్ వచ్చింది. చిరంజీవి 150వ సినిమాలో ఛాన్స్ రావడం నిజంగా కాజల్ కు గోల్డెన్ ఛాన్సే అనాలి. ఇవేకాక కాజల్ తమిళంలో అజిత్, జీవాలతో కూడా మూవీస్ చేస్తోంది.

కాజల్ మాదిరే సమంత కూడా మూవీస్ లోకి వచ్చి చాలాకాలమే అయింది. అయినా సామ్ టాప్ పొజిషన్ లోనే ఉంది. ఇప్పుడున్న మరే హీరోయిన్ కూడా ఆ ప్లేస్ లోకి రాలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన జనతా గ్యారేజ్ సక్సెస్, ఇటీవల వచ్చిన అ ఆ… మూవీస్ సమంతకు మరింత కలిసొచ్చాయి. సమంత గోల్డెన్ లెగ్ అని ఇంకోసారి ప్రూవ్ చేసుకుంది. అంతకు ముందు అత్తారింటికి దారేది, మనం వంటి పిక్చర్స్ కూడా సమంత స్టామినాను చాటాయి.

Leave a Reply

Your email address will not be published.