కథల్ని కాపీ కొట్టే వాళ్లున్నారు:కొరటాల శివ

ఏదైనా సినిమా విడుదలైన తర్వాత ఒక్కోసారి వివాదాలు చెలరేగుతుంటాయి. ఈ వివాదాలు రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా కథల గురించే చాలా సందర్భాల్లో ఈ కాంట్రవర్సీలు వస్తుంటాయి. ఎవరో రాసిన కథను కాపీ కొట్టి తమ పేరు వేసుకునే వారు కూడా ఫిలిం ఇండస్ట్రీలో కొందరున్నారు. ఎప్పుడోకప్పుడు ఆ సంగతి తెలిసి అసలు రచయిత ఫీలవుతాడు. లేటెస్ట్ గా ప్రముఖ డైరెక్టర్ ఇందుకు సంబంధించి ఓ సెన్సేషనల్  స్టేట్ మెంట్ ఇచ్చాడు.

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి హిట్స్ అందించిన డైరెక్టర్ కొరటాల శివ తాజాగా ఓ సంచలనాత్మక ప్రకటన చేశాడు. కొందరు దర్శకులకు కథ వినిపిస్తే విని, బాగలేదంటారని కానీ అదే కథతో సినిమా వస్తుందని, ఎవరి పేరో ఉంటుందని చెప్పాడు. పేరు వేయకపోగా, అసలు రచయితకు డబ్బులు కూడా ఇవ్వరని అన్నాడు. తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అంటున్నాడు. సినిమావాళ్లు  రచయితల్ని తేలిగ్గా చూస్తారని, గుర్తింపు కోసమే డైరెక్షన్ లోకి వచ్చానని కొరటాల చెప్పాడు.

సినిమాకు కథ రాస్తే పేరు, డబ్బు వస్తాయని ఆశపడేవాళ్లు చాలామందే ఉన్నారు. తాము రాసిన కథలు పట్టుకొని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల దగ్గరికి వెడుతుంటారు. వాళ్లకు స్టోరీ వినిపిస్తారు. ఆ కథ బాగున్నా, కొందరు డైరెక్టర్లు బాగలేదని ఆ రైటర్ ను పంపించేసి, కాస్త అటూ ఇటుగా అదే కథతో సినిమా తీసినవాళ్లూ ఉన్నారు. ఆ కథ తనదని, ఆ కథను కాపీకొట్టి సినిమా తీశారని ఒరిజినల్ రైటర్ ఆరోపించడం, ఒక్కోసారి కేసు పెట్టడం కూడా జరుగుతుంటుంది.

అదేవిధంగా తన కథలు కూడా చౌర్యానికి గురయ్యాయని, కొన్ని కథలు వేరేవాళ్ల  పేరుతో వచ్చాయని  కొరటాల శివ చెప్పాడు.  ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమా సింహా సినిమా కథ గురించి పరోక్షంగా కొరటాల ప్రస్తావించాడు.

Leave a Reply

Your email address will not be published.