ఇలియానా సీక్రెట్ మ్యారేజ్

ఇలియానా ఎంతోకాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ తో పీకల్లోతు ప్రేమలోవుంది. ఆ విషయాన్ని చాలా సార్లు ఇల్లీ బేబి చెప్పకనే చెప్పింది. చాలా సందర్భాల్లో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోలు బయటపడ్డాయి. సినిమాలు లేక ఖాలీగా వున్నప్పుడు ఇలియానా ఆండ్రూతోనే కాలం గడిపేదని అంటుంటారు. కాగా వీరిద్దరు సీక్రెట్ గా మ్యారేజ్ కూడా చేసుకున్నారని బాలీవుడ్ కోడై కూస్తుంది.

ఇలియానా తన కుటుంబం కూడా ఆండ్రూతో వివాహానికి అంగీకరించడంతో ఇరుకుటుంబాల వారి సమక్షంలో వీరిద్దరు పెళ్ళి చేసుకున్నారని టాక్. చాలా కాలంగా సినిమాలు సరిగా లేక డీలా పడ్డ ఇలియానాకు ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి. ఈ టైంలో తన పెళ్ళి సంగతి బయటపెడితే ఆఫర్లు తగ్గుతాయని పెళ్ళిని సీక్రెట్ గా వుంచినట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఆమె నటించిన ‘రుస్తుం’100 కోట్ల క్లబ్లోకి చేరింది. మరోమూవీ రిలీజ్కి రెడీ అయ్యింది. మరి ఇలియానా తన వివాహ విషయం ధైర్యంగా ఎప్పుడు బయట పెడుతుందో చూడాలి మరి.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.