అనుష్క భారీ సెట్

తెలుగు ఇండస్ట్రీలో ఇటు ప్రేమ కథా చిత్రాలు అటు సాంఘీక, జానపద, పౌరాణిక చిత్రాలకు న్యాయం చేయగలిగే నటి ఎవరైన ఉన్నారంటే ముందు వరుసలో అనుష్కనే ఉందని చెప్పవచ్చు. అందాలు ఆరబోతైన, డీ గ్లామర్ లుక్‌లో కనిపించాలన్నా, రాజసం కనపడే పాత్ర పోషించాలన్న అది అనుష్కకే చెల్లుతుంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ సపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్న అనుష్క తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతుంది. ఈ చిత్రంకు నిర్మాతలు భారీ ఖర్చు పెట్టబోతున్నట్ట తెలుస్తోంది.

టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా స్వీటీ అనుష్కకు చాలానే క్రేజ్ ఉంటుంది. కానీ ఆ క్రేజ్ తగ్గ స్థాయిలో సినిమాలు ఆడిన దాఖలాలు తక్కువ. రీసెంట్ టైమ్ లో అయితే బాహుబలి మినహాయిస్తే, అనుష్క చేసిన సినిమా ఒక్కటి కూడా ఆడిన దాఖలేలేమీ లేవు. తమిళ్ లో స్టార్ హీరో అజిత్ సరసన నటించిన ఎన్నై అరిందాల్ నుంచి టాలీవుడ్ మూవీ సైజ్ జీరో వరకు వరుసగా అన్ని డివైడ్‌ టాక్ తెచ్చుకున్న సినిమాలే. మరి ఈ నేపథ్యంలో అనుష్కపై భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.

అనుష్కను సోలోగా నమ్మేసి ఇన్వెస్ట్ చేసేయడం పెద్ద రిస్క్. కాకపోతే గతంలో అరుంధతి,  రుద్రమదేవి చిత్రాలు అనుష్క ప్రథాన పాత్రలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపధ్యంలో పిల్ల జమీందార్ ఫేమ్ డైరెక్టర్ అశోక్, ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో భాగమతి అనే భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నారట. 4.5 కోట్లకు పైగా ఖర్చు కేవలం ఈ ఒక్క సెట్ కోసమే నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెచ్చిస్తోందట.

400 ఏళ్ల క్రితం పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు భారీ సెట్ ని నిర్మిస్తున్నారని తాజా సమాచారం. ఇది పీరియాడికల్ చిత్రం కాదని, సామాజిక చిత్రమేనని గతంలో మేకర్స్ చెప్పినా, కీలకమైన ఓ సన్నివేశం కోసం మాత్రం ఈ సెట్ అవసరం ఉంటుందని తెలుస్తోంది.  ఒక్క సెట్ కోసమే దాదాపు 5 కోట్లు పెడితే, మొత్తం సినిమాకి వీళ్లు కేటాయించిన బడ్జెట్ ఎంతో అని ఫిలింనగర్లో మాట్లాడేసుకుంటున్నారు. మరి ఈ మొత్తాన్ని అనుష్క రాబడుతుందా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published.